Search
Monday 23 October 2017
  • :
  • :




Latest Update

రెమ్యునరేషన్ పెంచిన యంగ్ హీరో

రెమ్యునరేషన్ పెంచడం ఇది మనం కామన్ గా వినే పదమే. మన తెలుగు ఇండస్ట్రీలో ఇది చాలా కామన్. ఒక్క సినిమా హిట్ అయిందంటే చాలు మన హీరోలు రెమ్యునరేషన్ పెంచేస్తారు. అయితే ఇప్పుడు వరుస హిట్లు అందుకుంటున్న నాని కూడా ఇదే బాటలో పయనిస్తున్నాడు. ఇప్పటివరకు నాని సినిమాకు 5కోట్లు తీసుకునేవాడట.

అయితే నాని నటించిన చిత్రాలు 10 కోట్ల బడ్జెట్ తో తీస్తే 15 కోట్ల వరకు కలెక్ట్ చేస్తుండటంతో నానికి 5 కోట్లు పారితోషికం ఇవ్వడానికి ప్రొడ్యూసర్స్ ముందుకు వచ్చేవారు. ఇటీవల వచ్చిన ‘నేను లోకల్’ మూవీతో నాని క్రేజ్ మరింత పెరిగింది. దీనితో పారితోషికం పెంచుదామని నాని ఆలోచిస్తూ ఉండగానే ఇంకో 2,3 చిత్రాలకు అదే 5 కోట్ల పారితోషికంతోనే సంతకం చేసేసాడట. ఇప్పుడు రీసెంట్ గా రిలీజైన ‘నిన్ను కోరి’ కూడా హిట్ అవ్వడం, 20 కోట్లకు పైగా కలెక్ట్ చేసే అవకాశం ఉండటంతో నాని తన రెమ్యునరేషన్ 8 కోట్లకు పెంచాడట. 8 కోట్లు ఇచ్చి కూడా నానితో సినిమాలు తియ్యడానికి కొందరు నిర్మాతలు రెడీగా ఉన్నారట.




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *