మెరిసే చర్మం కోసం చిట్కాలు

మెరిసే చర్మం కోసం చిట్కాలు: –

పాలు, నిమ్మరసం:-

పాలు, నిమ్మరసం కలిపి, అందులో చిటికెడు ఉప్పు కూడా వేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్ప్లై చేయాలి. దీనివల్ల చర్మంలోని మురికి పోతుంది.

కీరదోసకాయ రసం, రోజ్ వాటర్:-

కీరదోసకాయ రసం, రోజ్ వాటర్ మరియు గ్లిజరిన్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్ప్లై చేసి, 15నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. ఇది మీ చర్మాన్ని ఎండ నుండి కాపాడుతుంది.

పసుపు, గంధం, పాలు:-

కొంచెం పసుపు, కొంచెం గంధం కలపాలి. ఈ మిశ్రమంలో పాలు కూడా వేసి, బాగా కలపాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్ప్లై చేసి, 5 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మీ ముఖం కాంతివంతంగా ఉంటుంది.

తేనె, క్రీమ్:-

కొంచెం తేనెలో క్రీమ్ కలపి, ముఖానికి పట్టించాలి. దీని వల్ల మీ ముఖం ప్రకాశిస్తుంది.

ద్రాక్ష:-

ద్రాక్ష మీ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ద్రాక్ష ను మీ ముఖానికి నేరుగా అప్ప్లై చెయ్యొచ్చు లేదా ద్రాక్ష రసాన్ని మీ ముఖానికి అప్ప్లై చెయ్యొచ్చు.

టొమాటో రసం:-

మెరిసే చర్మం కోసం, టొమాటో రసం మరియు నిమ్మరసం మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి.

క్యారెట్ రసం:-

క్యారెట్ రసం ముఖానికి రాసుకుంటే మిల మిల మెరిసే చర్మం మీ సొంతం.

ముల్తానిమట్టి, వేపాకులు, తులసి:-

తులసి ఆకులను, వేపాకులను పొడి చేసుకుని, అందులో ముల్తానిమట్టి, రోజ్ వాటర్, గులాబీ రేకలు వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమ్మాన్ని ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతంగా ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *