ప్రభాస్ సినిమాకు నో చెప్పిన స్వీటీ

ప్రభాస్ సినిమాకు నో చెప్పిన స్వీటీ

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ అనే మూవీ చేస్తున్నాడు. 150 కోట్ల భారీ బడ్జెట్ తో ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాకు కథానాయికను ఇంకా ఎంపిక చెయ్యలేదు. ‘బాహుబలి’ సినిమా ద్వారా ప్రభాస్ కి బాలీవుడ్ లో కూడా క్రేజ్ రావడంతో బాలీవుడ్ కి చెందిన దీపికా పదుకొనె, ఆలియా భట్ లాంటి టాప్ కథానాయికలను తీసుకుందామని మొదట్లో అనుకున్నారు కానీ ఆ తర్వాత విరమించుకున్నారు.

అనుష్క, ప్రభాస్ లది హిట్ పెయిర్ కావడం వల్ల అనుష్క శెట్టినే ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం అనుష్క ఈ మూవీలో నటించడం లేదని తెలిసింది. తన డేట్స్ ఖాళీ లేవని ఈ మూవీ కోసం డేట్స్ అడ్జస్ట్ చెయ్యలేనని స్వీటీ చెప్పిందట. స్వీటీ ఇలా చెప్పడానికి కారణం ఏమిటంటే ‘సాహో’మూవీ కోసం అడిగిన డేట్స్ అంతకుముందే ఒక తమిళ చిత్రానికి ఇచ్చేసిందట. అందుకే ‘సాహో’లో యాక్ట్ చెయ్యడం వీలుపడదని స్వీటీ చెప్పిందట. దీంతో చిత్ర యూనిట్ హీరోయిన్ ని వెతికే పనిలో పడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *