హర్రర్ సినిమాలో సాయి పల్లవి

హర్రర్ సినిమాలో సాయి పల్లవి

సాయి పల్లవి మలయాళం చిత్ర పరిశ్రమలో స్టార్ యంగ్ హీరోలతో జంటగా నటించి సక్సెస్ అయింది. ఇప్పుడు ‘ఫిదా’ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి  తొలి చిత్రంతోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది సాయి పల్లవి. అయితే ‘ఫిదా’ సినిమా రిలీజ్ అవకముందే తెలుగులో మరో రెండు చిత్రాలకు సైన్ చేసింది సాయి పల్లవి. ‘ఫిదా’ హిట్ అవ్వడం వల్ల సాయి పల్లవి టాలీవుడ్ లో ఎక్కువ ఆఫర్లతో బిజీ అయ్యింది. ఇప్పుడు సాయి పల్లవి మరొక హర్రర్ థ్రిల్లర్ చిత్రంలో నటించడానికి ఒప్పుకుంది.

ఇప్పటివరకు చేసిన సినిమాల్లో సాయి పల్లవి ఒక సాంప్రదాయమైన అమ్మాయిగా, ప్రేమికురాలిగా నటించింది. అయితే ఇప్పుడు దీనికి భిన్నంగా ఈ చిత్రంలో సీరియస్ క్యారెక్టర్ చేస్తుంది. ఈ మూవీ స్టోరీలో ఉన్న మలుపులు సాయి పల్లవికి బాగా నచ్చాయని అందుకే కధ చెప్పగానే ఒప్పుకుందని ఈ చిత్రయూనిట్ చెబుతున్నారు. అయితే ఈ సినిమాకి సాయి పల్లవి యాక్షన్ బాగా ప్లస్ అవుతుందని ఈ చిత్రయూనిట్ అంటున్నారు.

ప్రస్తుతం సాయి పల్లవి, నాగ శౌర్యతో కలిసి నటిస్తున్న మూవీ షూటింగ్ పూర్తయింది. దీనితో పాటు సాయి పల్లవి, నాని హీరోగా నటిస్తున్న ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ లో కూడా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే పూర్తికానుంది. ఈ రెండు చిత్రాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
ఈ హర్రర్ థ్రిల్లర్ సినిమా టీమ్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలుపుతాము అని చిత్ర టీమ్ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *