Search
Monday 23 October 2017
  • :
  • :




Latest Update

బోయపాటి కి భారీ ఆఫర్ ఇచ్చిన నాగ్

బోయపాటికి భారీ ఆఫర్ ఇచ్చిన నాగ్

ఈ మధ్య నాగార్జున తన కెరీర్ కంటే తన కొడుకులైన నాగ చైతన్య, అఖిల్ ల కెరీర్ పై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాడు. దీనిలో భాగంగానే ఈ మధ్య తన షూటింగ్స్ తగ్గించి ఎక్కువ టైంను కొడుకుల కోసం కేటాయిస్తున్నాడట. తాజాగా నాగార్జున బోయపాటి కి భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
ఈ మధ్య విడుదల అయిన నాగ చైతన్య ‘రారండోయ్ వేడుక చూద్దాం’ మూవీ నిర్మిచడంతో పాటు సినిమాకి సంబంధించిన అనేక పనులు నాగ్ దగ్గర ఉండి చూసుకున్నారు. ఈ సినిమా కు నాగార్జునే ఎడిటింగ్ చేసాడని, కొన్ని సన్నివేశాలు మళ్ళీ రీషూట్ చేయించాడని వార్తలు వచ్చాయి.. కానీ ఈ సినిమా నాగార్జున ఊహించినంతగా నాగ చైతన్యకు స్టార్ డమ్ తేలేకపోయింది..
ఇప్పుడు నాగార్జున స్టార్ డైరెక్టర్లతో నాగ చైతన్య సినిమాలు ప్లాన్ చేస్తున్నారట. అయితే కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్ లు బిజీగా ఉండటం వల్ల నాగ్ బోయపాటి దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా ఒక మాస్ సినిమా ప్లాన్ చేసాడట. ఈ సినిమాకు బోయపాటి కి నాగార్జున 12 కోట్లు రెమ్యూనరేషన్ ఆఫర్ చేసాడని ఫిలింనగర్ టాక్. ఈ ఆఫర్ ను బోయపాటి శ్రీను అంగీకరించాడట. ప్రస్తుతం బోయపాటి బెల్లంకొండ శ్రీనివాస్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి అవగానే చైతూ కోసం కథ రెడీ చేస్తాడట.




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *