మారుతీ కొత్త మోడల్ కారు.. అతి తక్కువ ధరకే ఎస్‌యూవీ(SUV) కార్..

మారుతీ కొత్త మోడల్ కారు.. అతి తక్కువ ధరకే ఎస్‌యూవీ(SUV) కార్..

Political News

దేశంలో అతి పెద్ద కార్ల కంపెనీల్లో ఒకటైన మారుతీ సుజుకి రీసెంట్ గా మార్కెట్లోకి చిన్న ఎస్‌యూవీ కారును విడుదలచేసింది. మారుతి కంపెనీ లో ఈ మోడల్ అతి చిన్న ఎస్ యూ వీ కార్. దీనిని మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో అనే పేరుతో దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం ఈ కార్ మార్కెట్లో ఇప్పటికే ఉన్న రెనాల్ట్ క్విడ్ మరియు డస్టన్ రెడిగో మోడల్ కార్లకు గట్టి పోటీ ఇవ్వబోతుందట.

ఫ్యూచర్ ఎస్ అనే కాన్సెప్ట్ తో ఈ కార్ తయారయ్యింది. ఇక ఈ కార్ ఫీచర్స్ విషయానికి వస్తే ఈ కారులో 1 లీటర్ పెట్రోల్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఈ కారు బిఎస్ 6 ప్రమాణాలకు తగిన విధంగా తయారుచేసారు. ఈ కారులో 5 గేర్లు ఉంటాయి. ఇది స్టాండర్డ్, ఎల్ఎక్స్‌ఐ, వీఎక్స్‌ఐ, వీఎక్స్ఐ ప్లస్ అనే 4 వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. అన్ని వేరియంట్లలలో ఒకేలాగా ఉండే విషయాలు ఏంటంటే డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఉంటాయి. ఢిల్లీ ఎక్సషోరూమ్ ధరల ప్రకారం చుస్తే ఈ కారు దర రూ.3.69 లక్షల నుంచి రూ.4.91 లక్షల వరకు ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *