మహేష్ పాత్ర గురించి చెప్పిన కొరటాల

 మహేష్ పాత్ర గురించి చెప్పిన కొరటాల

రీసెంట్ గా ‘స్పైడర్’ చిత్ర షూటింగ్ పూర్తి చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు తన నెక్స్ట్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసేసాడు. కొరటాల శివ, మహేష్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీకు ‘భరత్ అను నేను’ అనే టైటిల్ పెట్టారు. ఈ మూవీ రాజకీయ నేపథ్యంలో రూపొందుతుందని, ఇందులో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ మూవీలో ఇప్పటి రాజకీయాలపై సెటైర్స్ వేయడం లాంటివి ఉంటాయని కూడా ప్రచారం జరుగుతుంది.

తాజాగా ఒక ఈవెంట్లో కొరటాల శివ మాట్లాడుతూ ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చాడు. “మహేష్ బాబు ఈ చిత్రంలో ఒక యంగ్ సీఎం గా కనిపించనున్నాడు. ఏ పొలిటికల్ పార్టీని టార్గెట్ చేసి ఈ మూవీ తియ్యడంలేదు. మహేష్ క్యారెక్టర్ ఏ పొలిటీషియన్ ను పోలి ఉండదు. ఈ చిత్రంలో ఎలాంటి పొలిటికల్ సెటైర్స్ ఉండవు. ఈ మూవీలో పోలిటిక్స్, సీఎం లు ఈ విధంగా ఉంటే బాగుంటుందని చెప్పే ప్రయత్నం చేసాము. అంతేగాని ఇప్పటి రాజకీయాలపై సెటైర్స్ ఏమీ ఇందులో ఉండవు.” అని కొరటాల శివ చెప్పాడు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *