ఫిదా చూసిన కేసీఆర్ ఏమన్నారంటే….?

ఫిదా చూసిన కేసీఆర్ ఏమన్నారంటే....?

తాజాగా శేఖర్ కమ్ముల, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘ఫిదా’. ఈ సినిమాని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించాడు. ఈ సినిమా హిట్ టాక్ తో ఇప్పటివరకు మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. తన కెరీర్ లో మంచి హిట్ కోసం చూస్తున్న వరుణ్ తేజ్ కు ఈ సినిమా తన కెరీర్ లోనే మంచి సినిమాగా నిలిచింది.

ఈ సినిమాలో వరుణ్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ సాయి పల్లవి ఈ సినిమాలో తెలంగాణ అమ్మాయిగా యాక్టింగ్ ఇరగదీసింది. తెలంగాణ యాసలో మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకుంది. శేఖర్ కమ్ముల తనదైన స్టైల్ లో ఈ సినిమాను తీసాడు. ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో నిత్యం పనులతో బిజీగా ఉండే తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ సినిమాని చూసి ఫిదా అయ్యారంట. ఇటువంటి మంచి సినిమాని తీసినందుకు ఈ చిత్ర యూనిట్ ను అబినందించారంట. ఈ సంగతిని వంశీ కాకా తన ట్విట్టర్ అకౌంట్ లో ట్వీట్ చేసాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *