కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో దీపం వెలిగిస్తే…!

http://www.chitravedika.com/

కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు. ఈ కార్తీక పౌర్ణమిని  ”త్రిపురి పూర్ణిమ” అనీ, ”దేవ దీపావళి” అనీ అంటారు. మహాభారతంలో కార్తీక పౌర్ణమి రోజునే కార్తికేయుడు తారకాసురుణ్ణి చంపాడని వుంది.

కార్తీక పౌర్ణమి శివుడికి, విష్ణువుకి ప్రీతికరమైన రోజు. కార్తీక పౌర్ణమినాడు దీపారాధన చేస్తే, మనం చేసిన పాపాలన్నీ నశించిపోతాయి. కార్తీకమాసంలో వచ్చే సోమవారాలలో మరియు పౌర్ణమి నాడు  రుద్రాభిషేకం చేయిస్తే మంచిది. ముఖ్యంగా ఈ రోజున తెల్లవారుజామునే లేచి సముద్రస్నానం గానీ, నదీస్నానం గానీ చెయ్యటం మంచిది. నదీస్నానం గానీ, సముద్రస్నానం గానీ చెయ్యటానికి వీలులేని వాళ్ళు ప్రొద్దున్నే లేచి, స్నానం చేసి గుడికి వెళ్ళి  ప్రత్యేక పూజలు చేయించుకుంటే మంచిది.

కార్తీక పౌర్ణమి పర్వదినాన రోజంతా ఉపవాసం చెయ్యాలి. సంధ్యా సమయంలో 365 వత్తుల దీపాన్ని వెలిగించాలి. ఈ రోజున శివాలయంలో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది. ఈ రోజు సముద్రస్నానం గానీ, నదీస్నానం గానీ చేస్తే అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్యం కలుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *