కార్తీక పౌర్ణమి రోజున ఆవు నేతితో దీపారాధన చేస్తే….!

http://www.chitravedika.com/

దీపం అంటే అగ్ని దేవుడు అని మనందరికీ తెలుసు. కానీ దీపం అనేది జ్ఞానానికి, సంతోషానికి మరియు సంపదలకు ప్రతీక. దీపం యొక్క కాంతిలో ఉండే మూడు రంగులైన ఎరుపు, నీలం, పసుపు రంగులు లక్ష్మీదేవి, పార్వతిదేవి, సరస్వతీదేవి లకూ, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకూ సంకేతం.
కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన చెయ్యడం వల్ల శివానుగ్రహం పొందవచ్చని పురాణాలలో ఉంది. ఈ మాసంలో దీపం వెలిగించినా, దీపం వెలిగిస్తున్న వారికి సాయం చేసినా, ఆరిపోతున్న దీపంలో నూనె పోసినా పుణ్యం కలుగుతుందని కార్తీక పురాణంలో చెప్పబడి ఉంది.

కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగిస్తే గతజన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయి అని కార్తీక పురాణంలో ఉంది. అందుకనే కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో రాత్రంతా దీపాలు వెలిగిస్తారు. ఈ దీపాలను దీప మాలలు అంటారు.
ఈ రోజున కాశీలో గంగానది తీర సమీపంలో ఉన్న ఘాట్లన్నీ దీపాలతో నిండిపోతాయి. రాత్రంతా ఈ దీపాలు వెలుగుతూనే ఉంటాయి. దీన్ని కార్తీక దీపార్తన అంటారు. ఈ రోజున గంగానదిలో స్నానం చేస్తే ముక్తిని పొందవచ్చనేది మరో నమ్మకం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *