కార్తీక పౌర్ణమి విశిష్టత ఏమిటో తెలుసా..!

 http://www.chitravedika.com/

కార్తీక పౌర్ణమికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు. ఈ రోజున చేసే స్నానం అయినా, దానం అయినా, హోమం అయినా అనంతమైన పుణ్యాన్ని ఇస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున నదీస్నానం చేసి సాయంత్రం దీపం వెలిగించాలి. చెయ్యడం వల్ల పొందే ఫలాన్ని ఈ ఒక్కరోజు దీపారాధన చెయ్యడం వల్ల పొందొచ్చు.

కార్తీక పౌర్ణమి నాడు సత్యనారాయణ వ్రతం చేసి, వ్రతకథను వింటే శుభం కలుగుతుంది. సంధ్యా సమయంలో దేవాలయంలో గానీ, రావిచెట్టు దగ్గర గానీ లేదా తులసి దగ్గర గానీ దీపం వెలిగించాలి. కార్తీక పౌర్ణమి నాడు జాగరణ చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయి.

ఈ రోజున మహాశివుడికి నమక, చమక, మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకాలు చేయిస్తే ఆ భోళాశంకరుడు ప్రసన్నుడు అవుతాడని పురాణాలలో చెప్పబడివుంది. ఈ పర్వదినాన తులసి చెట్టు పక్కన ఉసిరిచెట్టు (కాయలతో సహా) కొమ్మను ఉంచి దాని పక్కన రాధాకృష్ణుల విగ్రహాన్ని పెట్టి పెళ్ళికాని అమ్మాయిలు పూజ చేస్తే కోరుకున్నవాడే భర్తగా లభిస్తాడు. కార్తీక పౌర్ణమినాడు ఉసిరికాయ దానం చేస్తే దారిద్యం నశించిపోతుంది. కార్తీక పౌర్ణమి రోజు లలితాదేవిని  లలితా సహస్రనామాలతో అర్చిస్తే ఆ లలితాదేవి సిరిసంపదలు కలుగజేస్తుంది. ఈ రోజున దీపారాధన చేస్తే ఆ పరమశివుడి అనుగ్రహం పొందవచ్చని, ఆరిపోతున్న దీపంలో నూనె పోసినా పుణ్యమే. కార్తీక పౌర్ణమి రోజున శివాలయంకు వెళ్ళి ఆ పరమ శివుడి దర్శనం చేసుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి.

కార్తీక పౌర్ణమినాడు శివ అష్టోత్తరము, లింగాష్టకంలను పఠిస్తే పాపాలు తొలగిపోతాయి అనేది ఒక నమ్మకం. ఈ రోజు మట్టి ప్రమిదల్లో 1008 వత్తులు వేసి దీపారాధన చెయ్యాలి. నక్షత్రహారతి కోసం ఆవు నేతిని, దీపారాధన కోసం నువ్వులనూనెను వాడాలి. విభూది ధరించి, “ఓం నమః శివాయ” అనే పంచాక్షర మంత్రాన్ని 108 మార్లు జపించాలి. జపమునకు రుద్రాక్ష మాల వాడాలి. పూజచేసేటప్పుడు పడమర వైపు కూర్చోవాలని పండితులు చెబుతున్నారు.

శివ పంచాక్షరీ స్తోత్రము, శివ సహస్ర నామము, శివ పురాణములను పారాయణం చేస్తే సకల సంపదలు కలుగుతాయి. కార్తీక పౌర్ణమినాడు శ్రీశైలం, శ్రీకాళహస్తి వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటే పుణ్యం కలుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *