Search
Monday 23 October 2017
  • :
  • :




Latest Update

ఆగష్టు 15న ప్రారంభం కానున్న చిరు సినిమా

ఆగష్టు 15న ప్రారంభం కానున్న చిరు సినిమా

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్. 150 చిత్రంతో రీఎంట్రీ ఇచ్చి పెద్ద సక్సెస్ అందుకున్నాడు. అయితే చిరు తన 151వ చిత్రంగా స్వాతంత్రం కోసం పోరాడిన వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను ఎంచుకున్నాడు.ఈ సినిమాను రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను జాతీయస్థాయి సినిమాగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నారు.

18వ శతాబ్దంలో జరిగిన సంఘటనలను ఆధారంగా తీసుకుని రూపొందిస్తున్న ఈ సినిమా చిరంజీవి బర్త్ డే రోజైన ఆగస్టు 22న ప్రారంభం కానుందని వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఆగస్టు 15న ప్రారంబించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను వేసవికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *